Pvan kalyan: యాక్షన్ సీన్ తోనే పవన్ ఎంట్రీ

Vakeel Saab Movie
  • 'వకీల్ సాబ్' గా పవన్ కల్యాణ్
  • తెలుగు వెర్షన్లో మార్పులు
  • ఆగస్టుకు విడుదల వాయిదా

పవన్ కల్యాణ్ తాజా చిత్రంగా 'వకీల్ సాబ్' రూపొందుతోంది. హిందీ హిట్ మూవీ 'పింక్' రీమేక్ ఇది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కథలో కొన్ని మార్పులు చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి వుంది.  పవన్ రీ ఎంట్రీ మూవీ కావడంతో, ఈ సినిమాలో ఆయన ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుందా అనే కుతూహలాన్ని కనబరుస్తున్నారు.

పవన్ రీ ఎంట్రీ .. ఒక భారీ యాక్షన్ సీన్ తో ఉంటుందని అంటున్నారు. అభిమానులతో విజిల్స్ వేయించేలా ఈ యాక్షన్ సీన్ ను డిజైన్ చేయించారని తెలుస్తోంది. సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ యాక్షన్ సీన్ ఉంటుందని చెబుతున్నారు. ముందుగా ఈ సినిమాను మే 15వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆగస్టుకు వాయిదా వేసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News