Anantapur District: ఎండలో వెళుతున్న బాలింత... అనంత పోలీసుల మానవత్వం!

Kalyanadurgam Police Help to Mother
  • కల్యాణదుర్గంలో విధుల్లో ఉన్న పోలీసులు
  • భర్తతో కలిసి చంటిబిడ్డతో వెళుతున్న మంగమ్మ
  • తన వాహనంలో ఇంటికి పంపిన డీఎస్పీ
లాక్‌ డౌన్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసే విధుల్లో ఉన్న పోలీసులు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటూ తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా, అనంతపురం జిల్లా, కల్యాణదుర్గం పట్టణ పరిధిలో, ఎండలో వెళుతున్న ఓ బాలింతను చూసి చలించిపోయిన డీఎస్పీ వెంకటరమణ, తన వాహనంలో ఆమెను ఇంటికి పంపించారు.

స్థానిక హిందూపురం రోడ్ లో ఆయన తన సిబ్బందితో విధుల్లో ఉన్న వేళ, ఈ నెల 13న ఆర్టీటీ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఉప్పొంక గ్రామానికి చెందిన మంగమ్మ అనే మహిళను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతూ పోలీసుల కంటపడింది. వివరాలు తెలుసుకున్న డీఎస్పీ, ఎండలో అంతదూరం వెళ్లడం తల్లికి, బిడ్డకు క్షేమం కాదని, తన వాహనంలో ఆమెను ఇంటికి పంపించారు.
Anantapur District
Kalyanadurgam
New Born Baby
Vehicle

More Telugu News