Afghanistan: ‘థ్యాంక్యూ మై ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ మోదీకి ఆఫ్ఘన్ అధ్యక్షుడు ధన్యవాదాలు

Afghanistan president thanks to PM Modi
  • భారత్ నుంచి ఆఫ్ఘన్ కు హైడ్రో క్లోరోక్విన్ , పారాసిటమాల్ టాబ్లెట్స్, గోధుమలు
  • ఈ సరుకు మాకు చేరుబోతోందన్న అష్రాఫ్ ఘనీ 
  • భారత్ కు, మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్
భారత్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి ఆఫ్ఘనిస్థాన్ ధన్యవాదాలు తెలిపింది. ‘కరోనా’ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు హైడ్రో క్లోరో క్విన్ , పారాసిటమాల్ టాబ్లెట్స్, గోధుమలను ఇస్తున్నందుకు అక్కడి ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఓ ట్వీట్ చేశారు. ‘థ్యాంక్యూ మై ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ ప్రధాని మోదీని సంబోధిస్తూ ధన్యవాదాలు తెలిపారు. మొదటి విడత సరకు తమ దేశానికి, తమ ప్రజలకు ఒకట్రెండు రోజుల్లో చేరబోతోందని ఆయన పేర్కొన్నారు.
Afghanistan
Ashraf ghani
Narendra Modi
India
Prime Minister

More Telugu News