Jagan: చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎం జగన్!
- చంద్రబాబుకి రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు
- చంద్రబాబు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న జగన్
- గతంలో జగన్‌కి చంద్రబాబు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
'నారా చంద్రబాబు నాయుడి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ జగన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, గతంలోనూ జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.