Corona Virus: రోజూ 20 లక్షల మంది ఆకలి తీరుస్తున్న విప్రో!

Wipro provides food for 20 lakh people daily
  • వెల్లడించిన విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌ జీ
  • కరోనా సంక్షోభ సమయంలో  ప్రజలకు అండగా నిలిచిన సంస్థ
  • ఇప్పటికే 1,125 కోట్ల భారీ విరాళం ప్రకటన
కరోనా వైరస్‌పై పోరాటంలో ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాయి. ‘విప్రో’ కంపెనీ ఇప్పటికే రూ. 1,125 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఆ సంస్థ అక్కడితోనే ఆగిపోలేదు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తోంది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదల ఆకలి తీరుస్తోంది. తమ సంస్థ ప్రతి రోజు 20 లక్షలకు పైగా ప్రజలకు ఆహారాన్ని అందిస్తోందని విప్రో చైర్మన్ రిషద్  ప్రేమ్‌జీ ట్వీట్ చేశారు.

కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను ఆదుకునేందుకు మరెన్నో సంస్థలు కృషి చేస్తున్నాయని చెప్పారు. అలాంటి వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. అయితే, ఇంకా చాలామందికి ఇలాంటి సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల మీరు చేయగలిగిన సాయం వారికి చేయండి అంటూ రిషద్ విజ్ఞప్తి చేశారు.
Corona Virus
Wipro
provides
food
20 lakh
people
daily

More Telugu News