Nara Lokesh: కోట్లాది తెలుగు ప్రజలకు ఆయన స్ఫూర్తిదాత: నారా లోకేశ్

Nara Lokesh greets hif father Chandrababu
  • చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
  • అవిశ్రాంతంగా పని చేస్తున్న తండ్రిని చూస్తూ పెరిగానని ట్వీట్
  • ఆయనలో నిబద్ధత ఏమాత్రం సడలలేదని వ్యాఖ్య
తన తండ్రి చంద్రబాబుకు టీడీపీ నేత నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేస్తున్న తన తండ్రిని చూస్తూనే పెరిగానని ట్వీట్ చేశారు. మొదటి నుంచి ఆయన ఆకాంక్ష, నిబద్ధత, పట్టుదల కొంత కూడా సడలలేదని చెప్పారు. విజనరీ లీడర్ షిప్ తో తనతో పాటు కోట్లాది మంది తెలుగు ప్రజలకు ఆయన స్ఫూర్తిదాత అని కొనియాడారు. 'హ్యాపీ బర్త్ డే పీపుల్స్ లీడర్స్ చంద్రబాబు నాయుడు' అని ట్వీట్ చేశారు.
Nara Lokesh
Chandrababu
Telugudesam

More Telugu News