ప్రేమకథనే చేయమని పరశురామ్ కి చెప్పిన మహేశ్ బాబు!
- కథ విషయంలో మహేశ్ చెప్పిన మార్పు
- రొటీన్ కి భిన్నంగా ఉండాలన్న మహేశ్
- ప్రేమకథపైనే పరశురామ్ కసరత్తు
ఇంతకుముందు వరుసగా తను చేసిన నాలుగు సినిమాల్లోను ప్రేమకథ పాళ్లు తక్కువగా ఉండటాన్ని గమనించిన మహేశ్ బాబు, పరిణతిని సాధించిన ప్రేమకథను సిద్ధం చేయమని పరశురామ్ తో చెప్పాడట. 'గీత గోవిందం' తరహాలోనే ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గకూడదనీ, ఆ సినిమా మాదిరిగానే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుండాలని అన్నాడట. మహేశ్ బాబు సూచన మేరకు, ఆ తరహా కథపై పరశురామ్ కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. మొత్తానికి చాలా కాలం తరువాత మహేశ్ బాబు ప్రేమకథలో కనిపించనున్నాడన్న మాట.