Mahesh Babu: ఆమె నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి.. ఏప్రిల్‌ 20 నాకు చాలా ప్రత్యేకం: మహేశ్‌ బాబు

Mahesh babu  the most special person in my life
  • మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి జన్మదినం నేడు
  • తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్
  • గతంలో తన తల్లితో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన మహేశ్
సినీనటుడు మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి జన్మదినం నేడు. ఈ సందర్భంగా మహేశ్‌ బాబు తన తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. 'ఏప్రిల్‌ 20.. నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తికి సంబంధించి, చాలా ప్రత్యేకమైన రోజు.. హ్యాపీ బర్త్‌ డే అమ్మ' అని మహేశ్‌ బాబు ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా గతంలో తన తల్లితో దిగిన ఫొటోను ఆయన పోస్ట్ చేశాడు.
                                         
త‌న ఫ్యామిలీతో పాటు వ్యక్తిగత విష‌యాల‌ను, సినిమా విశేషాలను మహేశ్‌ బాబు సోష‌ల్ మీడియో వేదిక‌గా పంచుకుంటాడు. కాగా, సూపర్ స్టార్ కృష్ణ 1961లో ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రమేశ్ బాబు కొన్ని సినిమాల్లో నటించాడు. చిన్న కుమారుడు మహేశ్‌ బాబు టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్నాడు.
Mahesh Babu
Tollywood

More Telugu News