Vidya balan: బ్లౌజ్ పీస్ తో మాస్క్ ఇలా తయారు చేసుకోవాలంటూ సినీ నటి విద్యాబాలన్ పోస్ట్

Bollywood Artist Vidya Balan posts a video about Mask preparation
  • ఒక బ్లౌజ్ పీస్, రెండు రబ్బరు బ్యాండ్స్ చాలు 
  • అదే చీరతో అయితే మరిన్ని మాస్క్ లు తయారు చేయొచ్చు
  • ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసిన విద్యా బాలన్
కరోనా’ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన ముందు జాగ్రత్తల్లో ఒకటి మాస్క్ ధరించడం. ప్రతి ఒక్కరి వద్ద ఉండే హ్యాండ్ కర్చీఫ్ తో మాస్క్ ను ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు తమ వీడియోల ద్వారా ప్రజలకు చూపించిన విషయం తెలిసిందే.

తాజాగా, బాలీవుడ్ ప్రముఖ నటి విద్యా బాలన్ కూడా ఇదే విషయమై ఓ ఆసక్తికర వీడియో పోస్ట్ చేసింది. బ్లౌజ్ పీస్ తో మాస్క్ ను ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చో చూపిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ మాస్క్ తయారీకి ఒక బ్లౌజ్ పీస్, రెండు రబ్బరు బ్యాండ్లు చాలని, అదే కనుక, చీరతో అయితే చాలా మాస్క్ లను తయారు చేసుకోవచ్చని చెప్పింది.


Vidya balan
Bollywood
actress
Corona Virus
mask

More Telugu News