Luc Montagnier: ఎయిడ్స్ కు వ్యాక్సిన్ తయారుచేసే క్రమంలోనే కరోనా వైరస్ పుట్టిందన్న నోబెల్ గ్రహీత

French Nobel laureate Luc Montagnier alleges corona virus a man made
  • కరోనా జన్మస్థానం వుహాన్ లోనే అని స్పష్టీకరణ
  • ఈ వైరస్ లో హెచ్ఐవీ అంశాలు, మలేరియా క్రిమి ఉన్నట్టు వెల్లడి
  • ఇది సహజంగా పుట్టిన వైరస్ కాదంటూ అనుమానాలు
ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. ట్రంప్ అంతటివాడు సైతం ఇది చైనాలోనే పుట్టిందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ వైరాలజీ నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత ల్యూక్ మోంటాగ్నీర్ తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు.

కరోనా వైరస్ మనిషి చేతిలో రూపుదిద్దుకున్న వైరస్ అని, ఎయిడ్స్ కు వ్యాక్సిన్ తయారుచేసే ప్రయత్నంలోనే ఈ మహమ్మారి ఉద్భవించిందని తెలిపారు. ఈ వైరస్ కు కేంద్రం వుహాన్ అనడంలో సందేహం అక్కర్లేదని, ఓ చైనా లాబోరేటరీనే దీనికి జన్మస్థానం అని స్పష్టం చేశారు.

"కరోనా వైరస్ జీనోమ్ ను పరిశీలిస్తే అందులో హెచ్ఐవీ ఎలిమెంట్లతో పాటు మలేరియా క్రిమి కూడా ఉన్నట్టు తెలిసింది. ఇవన్నీ బేరీజు వేసి చూస్తే కరోనా వైరస్ సహజంగానే పుట్టిన వైరస్ అనిపించడంలేదు. ఈ వైరస్ లక్షణాలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి" అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి వుహాన్ లో ఉన్న వైరాలజీ ల్యాబ్ లో కరోనా తరహా ప్రమాదకర వైరస్ లపై పరిశోధనలు సాగుతున్నాయని, ఆ ల్యాబ్ లో ఇటీవల ఏదో ఒక భారీ విఘాతం సంభవించి ఉండొచ్చని అన్నారు.

ఫ్రాన్స్ కు చెందిన ల్యూక్ మోంటాగ్నీర్ అత్యంత ప్రమాదకర ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ ను గుర్తించినవారిలో ఒకరు. 2008లో ఆయనకు మరో ఇద్దరితో కలిపి వైద్యరంగంలో నోబెల్ పురస్కారం ప్రదానం చేశారు.
Luc Montagnier
Corona Virus
AIDS
HIV
Malaria
Wuhan
China

More Telugu News