Corona Virus: బార్బర్ షాపునకు వెళ్లాలనుకుంటున్నారా...కరోనా వెన్నంటి ఉంటుంది జాగ్రత్త మరి!

Now the time better not to go barber shop
  • క్రాప్ చేసుకోవాలని వెళితే జరజాగ్రత్త అంటున్న నిపుణులు
  • అక్కడ వాడే సాధనాలు, సౌకర్యాలతో సమస్యే
  • వీలైనంత వరకు వెళ్లక పోవడమే మంచిదని సలహా
లాక్‌డౌన్‌తో జుత్తు పెరిగిపోతోందని ఇబ్బందిగా భావిస్తున్నారా... గెడ్డం మాసిపోయిందని బాధపడుతున్నారా...ఏదోలా బార్బర్ షాపు తెరిపించి పనిపూర్తి చేయించుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. అమెరికాలో యాభై శాతం కరోనా కేసుల వ్యాప్తి కేవలం బార్బర్ షాపులవల్లే వచ్చాయని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ ఇబ్బంది ఏ దేశంలోనైనా ఉంటుందని, ఆయా షాపుల్లో వాడే రేజర్, బ్రష్, టవల్, కుర్చీ కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతాయని చెబుతున్నారు. 'షాపు తెరిస్తే ఎంతోమంది వస్తారు. కనీసం ఇంటి వద్దకు రప్పించుకుని చేయించుకున్నా అలా చాలామంది చేయించుకుని ఉంటారు. వీరిలో ఏ ఒక్కరు కరోనా బాధితులైనా అందరికీ రావడం ఖాయం' అని హెచ్చరిస్తున్నారు.

'లాక్‌డౌన్‌ ముగిసే వరకే కాదు, ఆ తర్వాత కొన్నాళ్ల వరకు ఇంట్లోనే పనిపూర్తి చేసుకోవడం బెటర్. లేదంటే బార్బర్‌ను ఇంటికి పిలిస్తే మీ వ్యక్తిగత సాధనాలు ఇచ్చి పనిపూర్తి చేయించుకోవాలి' అని తెలియజేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి బార్బర్ షాపులు తెరిపించాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయి.

'నా భార్య పెరిగిన నా జుత్తు చూడలేకపోతున్నానంటోంది. కటింగ్ చేయించుకోకుంటే తానే కటింగ్ చేస్తానంటోంది. అందువల్ల షాపులు తెరిచేలా చూడన్నా' అంటూ ఓ యువకుడు మంత్రి కేటీఅర్ కు ట్వీట్ చేశాడు. దీనికి కేటీఆర్ 'క్రికెటర్ కొహ్లీ అంతటోడే భార్య అనుష్కతో కటింగ్ చేయించుకున్నాడు. నువ్వు కూడా అదే ఫాలో అయిపోతే పోలే' అంటూ సరదాగా సమాధానమిచ్చారు. మరి మనం కూడా అదే ఫాలో అయితే బెటరేమో... ఓసారి ఆలోచించండి మరి.
Corona Virus
Barber shop
Not to go

More Telugu News