Chiranjeevi: తమ్ముళ్లు, చెల్లెళ్ల ఫొటో పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi about his family
  • ఓ ఆదివారం రోజున ఈ ఫొటో తీసుకున్నాం
  • వారిని మిస్‌ అవుతున్నాను
  • ఆ రోజులు మళ్లీ త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాను
తమ్ముళ్లు, చెల్లెళ్లతో కలిసి గతంలో తీసుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'లాక్‌డౌన్‌కి ముందు ఓ ఆదివారం రోజున ఈ ఫొటో తీసుకున్నాం. ఇష్టపడే వారిని కలవడాన్ని మిస్‌ అవుతున్నాను. మీలో చాలా మంది కూడా ఇలాగే భావిస్తున్నారని అనుకుంటున్నాను. ఆ రోజులు మళ్లీ త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాను. ఓ ఆదివారం - అమ్మ దగ్గర,  నేను- చెల్లెళ్లు, తమ్ముళ్లు' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అప్పటి ఫొటోను పోస్ట్ చేశారు.

చిరంజీవి చేసిన ట్వీట్ మెగా అభిమానులను అలరిస్తోంది. చిరు ట్వీట్ చూసిన అభిమానులు తాము గతంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. క‌రోనా విజృంభణ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ట్వీట్లు చేస్తోన్న చిరంజీవి అప్పుడప్పుడు తన కుటుంబ విషయాలనూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ రోజు పోస్ట్ చేసిన ఈ ఫొటోలో చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనా దేవి, తమ్ముళ్లు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌, చెల్లెళ్లు మాధవి, విజయ ఉన్నారు.

Chiranjeevi
Tollywood
Lockdown
Pawan Kalyan

More Telugu News