Kolkata: షాకింగ్: ఫేస్‌మాస్క్ ధరించని కొడుకు.. చంపేసిన 78 ఏళ్ల తండ్రి

78 year old father kills son for refusing to wear face mask
  • మాస్క్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ
  • దివ్యాంగుడైన కుమారుడి గొంతు బిగించి హత్య
  • పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు
కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో బయటకు వెళ్తూ ఫేస్‌మాస్క్ ధరించేందుకు నిరాకరించిన కొడుకును దారుణంగా చంపేశాడో తండ్రి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగిందీ ఘటన. నిందితుడిని షోవాబజార్‌కు చెందిన 78 ఏళ్ల బన్సిధర్ మల్లిక్‌గా పోలీసులు గుర్తించారు. వారి కథనం ప్రకారం.. నిందితుడు బన్సిధర్ కుమారుడు శీర్షేందు మల్లిక్ (45) దివ్యాంగుడు. నిన్న అతడు బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మాస్క్ ధరించాలని తండ్రి కోరాడు. అందుకు శీర్షేందు నిరాకరించడంతో తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన తండ్రి ఓ గుడ్డముక్కతో కుమారుడి గొంతు బిగించాడు. ఫలితంగా ఊపిరి ఆడక శీర్షేందు ప్రాణాలు కోల్పోయాడు.  

అనంతరం నిందితుడు బన్సిధర్ శ్యాంపుకుర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయి జరిగిన విషయం చెప్పాడు. అతడు చెప్పింది విన్నవెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Kolkata
father
Son
Face Mask
Corona Virus

More Telugu News