Nara Lokesh: 'లాక్ డౌన్ వేళ హైదరాబాద్ రోడ్లపై లోకేశ్ సైకిల్ సవారీ' అంటూ వైసీపీ తీవ్ర విమర్శలు!

YSRCP alleges Lokesh breached lock down rules by cycling on the road
  • లోకేశ్ ఫొటోలు పోస్టు చేసిన వైసీపీ
  • నిబంధనలు పట్టవా? అంటూ మండిపాటు
  • హైదరాబాదులో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యలు
హైదరాబాదులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైకిల్ తొక్కుతున్న ఫొటోలను పోస్టు చేసిన వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెప్పేందుకే నీతులా? లాక్ డౌన్ నిబంధనలు పట్టవా? అంటూ మండిపడింది.

"లాక్ డౌన్ వేళ హైదరాబాద్ రోడ్లపై లోకేశ్ సైకిల్ సవారీ. మాస్క్ ధరించాలన్న నిబంధన కూడా ఉల్లంఘన. పిల్లలను బయటికి తేవద్దన్న ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు. హైదరాబాదులో కూర్చుని ఎంజాయ్ చేస్తూ, రేయింబవళ్లు కష్టపడుతున్న ప్రభుత్వంపై విమర్శలా?" అంటూ వైసీపీ ట్విట్టర్ లో నిప్పులు చెరిగింది. 
Nara Lokesh
YSRCP
Cycling
Hyderabad
Lockdown
Corona Virus
Andhra Pradesh

More Telugu News