Pawan Kalyan: ఏమాత్రం అనుకూల పరిస్థితులు ఉన్నా వారిని తీసుకురండి: ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

Pawan Kalyan requests AP government as thousands of fishermen stranded in Gujarat
  • గుజరాత్ లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులు
  • వారిని ఆదుకోవాలని కోరిన పవన్
  • జిల్లా మంత్రులను, అధికారులను గుజరాత్ పంపాలని సూచన
గుజరాత్ లో చిక్కుకుపోయిన 4 వేల మంది శ్రీకాకుళం మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా గుజరాత్ తీర ప్రాంతాల్లో ఏపీకి చెందిన వేలమంది నిలిచిపోయారని, లాక్ డౌన్ పరిస్థితులను అర్థం చేసుకుని వారిని ఆదుకోవాలని పవన్ కోరారు. కనీసం సంబంధిత జిల్లా మంత్రులను కానీ, ఉన్నతాధికారులను కానీ గుజరాత్ పంపించి, మత్స్యకారులకు భరోసా ఇవ్వాలని సూచించారు. ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉన్నా వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని తెలిపారు.
Pawan Kalyan
Andhra Pradesh
YSRCP
Fishermen
Srikakulam District
Gujarat
Lockdown
Corona Virus

More Telugu News