Marriage: లాక్ డౌన్ నేపథ్యంలో పుట్టింట్లోనే ఉండిపోయిన భార్య... మరో పెళ్లి చేసుకున్న భర్త

Husband gets second marriage as wife resided at her parents home
  • పాట్నాలోని పాలీగంజ్ లో ఘటన
  • లాక్ డౌన్ కు ముందు పుట్టింటికి వెళ్లిన భార్య
  • ఆంక్షల కారణంగా పుట్టింటికే పరిమితం
  • అసహనానికి గురైన భర్త
దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ అనేక సంఘటనలకు కారణమవుతోంది. బీహార్ లోని ఓ వ్యక్తి భార్య కాపురానికి రాకపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. పాట్నా పాలీగంజ్ కు చెందిన ధీరజ్ కుమార్ కు దుల్హిన్ బజార్ కు చెందని యువతితో ఇటీవలే పెళ్లయింది.

కొన్నిరోజుల కిందటే ఆమె పుట్టింటికి వెళ్లగా, ఆపై లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో ఆ యువతి పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ధీరజ్ కుమార్ అసహనానికి లోనై, భార్యను వెంటనే వచ్చేయాలని అనేకమార్లు ఫోన్ చేశాడు. వాహనాలు లేకపోవడం, పోలీసుల ఆంక్షలతో ఆ యువతి భర్త వద్దకు రాలేకపోయింది. దాంతో మరింత అసంతృప్తికి గురైన ధీరజ్ కుమార్ తన భార్యపై కోపంతో మాజీ ప్రియురాలి మెళ్లో తాళికట్టేశాడు. దాంతో దిగ్భ్రాంతికి గురైన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.
Marriage
Bihar
Patna
Local Body Polls
Corona Virus
Police

More Telugu News