Vijayasai Reddy: సందు దొరకలేదు కానీ ఈ ఐడియా ఇచ్చింది నేనే అని డప్పు వాయించుకునేవాడు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy ridicules Chandrababu over corona measures
  • కొరియా నుంచి లక్ష టెస్టింగ్ కిట్లు వచ్చాయని వెల్లడి
  • జగన్ వంటి సీఎం మరెవరైనా ఉన్నారా? అంటూ సవాల్
  • ఎల్లో వైరస్, ఎల్లో మీడియా అంటూ వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయని, 'ఎల్లో వైరస్' ఇక జాగారం చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. దేశం మొత్తమ్మీద సీఎం జగన్ లా చొరవ చూపిన రాష్ట్రం మరేదైనా ఉంటే 'ఎల్లో మీడియా' చూపించాలని సవాల్ విసిరారు. 'విజనరీ'కి సందు దొరకలేదు కానీ ఈ ఐడియా ఇచ్చింది తానేనని డప్పు వాయించుకునేవాడు అంటూ పరోక్షంగా చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, ఇంగ్లీష్ మీడియం అంశంపైనా విజయసాయి స్పందించారు. "ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం జీవోను కొట్టివేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లకూడదట. దానిపై పిటిషన్లు వేయిస్తూ, ఎగువ కోర్టుకు వెళ్లడం అమానుషం అంటాడు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల రక్తం తాగావు. పేద పిల్లలు నీ మనవడిలా చదువుకోవద్దా? వాళ్లేం పాపం చేశారు బాబూ?" అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News