Telangana: హైదరాబాదులో విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్!

Telangana constable tests corona positive
  • గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహించిన కానిస్టేబుల్
  • బాధితుడి  స్వస్థలం రంగారెడ్డి జిల్లా మునగనూరు
  • కుటుంబసభ్యుల రిపోర్టులు  రావాల్సి ఉంది
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామానికి చెందిన కానిస్టేబుల్ హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహించారు.

తన స్వగ్రామానికి వెళ్లిన ఆయనకు గురువారం నాడు కరోనా లక్షణాలు కనిపించడంతో 104కి సమాచారం అందించారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులను హైదరాబాదులోని కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారించింది. కుటుంబసభ్యుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. మునగనూరులో పాజిటివ్ కేసు నమోదు కావడంతో... అధికారులు అప్రమత్తమయ్యారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. గ్రామస్తులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Telangana
Hyderabad
constable
Corona Virus
Gandhi Hospital

More Telugu News