Virat Kohli: రివర్స్ సాధ్యం కాదు.. నా జుట్టును కోహ్లీ చేతిలో పెట్టను: అనుష్క

 What Anushka Sharma Thinks About Getting A Haircut From Virat Kohli
  • భర్తతో హెయిర్ స్టయిల్ చేయించుకోనని వెల్లడి
  • తమపై వేసిన కార్టూన్‌ను షేర్ చేసిన బాలీవుడ్ నటి
  • లాక్‌డౌన్‌లో విరాట్‌కు హెయిర్ కట్ చేసిన అనుష్క
లాక్‌డౌన్ సమయంలో సాధారణ ప్రజల మాదిరిగానే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ముంబైలోని తమ ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ  బిజీ బిజీగా ఉండే ఈ జంట అనూహ్యంగా వచ్చిన విరామాన్ని ఆస్వాదిస్తోంది. సోషల్ మీడియా ద్వారా కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో ఇంట్లో  సరదాగా తీసుకున్న ఫొటోలు, వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

ఈ క్రమంలో కోహ్లీకి హెయిర్ కట్ చేసిన అనుష్క ఆ వీడియోను షేర్ చేసింది. అది చాలా వైరల్‌ అయింది. దీనిపై  రకరకాల మిమ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అర్పిత్ దుడ్వెవాల్ అనే  క్యారికేచర్ ఆర్టిస్ట్.. కోహ్లీ, అనుష్కపై  ఓ కార్టూన్ గీశాడు. ఇందులో అనుష్క జుట్టును కోహ్లీ ట్రిమ్ చేస్తూ కనిపిస్తాడు. ఈ కార్టూన్‌ను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలాగే,  ఒకవేళ విరాట్ తనకు హెయిర్ కట్ చేస్తాడా? అని ఊహించుకున్న అనుష్క దానికి సమాధానం కూడా చెప్పింది. ‘రివర్స్... సాధ్యం కాదు’ అని కామెంట్ చేసింది. తాను కోహ్లీకి హెయిర్ స్టయిల్ చేసినప్పటికీ.. తన జుట్టు మాత్రం భర్త  చేతిలో పెట్టనని అనుష్క స్పష్టం చేసింది.
Virat Kohli
Anushka Sharma
hair style

More Telugu News