Vijay: అమలా పాల్ మాట తప్పింది కనుకనే విడాకులు: దర్శకుడు విజయ్ తండ్రి

Amala Paul divorce story
  • పెళ్లి తరువాత సినిమాలు చేయొద్దని విజయ్ చెప్పాడు
  • ముందు అంగీకరించిన అమలా పాల్
  • ఆమె పద్ధతి మార్చుకోలేదన్న విజయ్ తండ్రి  
తెలుగు .. తమిళ  భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, కొంతకాలం క్రితం తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అందుకుగల కారణాన్ని గురించి విజయ్ తండ్రి 'అజగప్పన్' తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

"విజయ్ -  అమలా పాల్ ప్రేమించుకున్నారు .. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అమలా పాల్ సినిమాలు చేయడం విజయ్ కి ఇష్టం లేదు. అతని ఇష్ట ప్రకారమే మానేస్తానని అమలా పాల్ మాట ఇచ్చింది. కానీ ఆ తరువాత వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టింది. మేము చెప్పినా .. పుట్టింటివారు చెప్పినా ఆమె తన పద్ధతిని మార్చుకోలేదు. ఎవరు ఎంతగా చెబుతున్నా ఆమె పట్టించుకోకపోవడంతో, విడాకుల వరకూ వెళ్లవలసి వచ్చింది" అని ఆయన చెప్పుకొచ్చారు.
Vijay
Amala Paul
KollyWood

More Telugu News