పెళ్లికి ముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం: కుమారుడి పెళ్లిపై మాజీ సీఎం కుమారస్వామి
- పెళ్లి చేసి తప్పు చేయలేదు
- మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు
- పరిస్థితులు కొలిక్కి వచ్చాక అందరితో కలిసి భోజనం చేస్తా
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంటే సామాజిక దూరం నిబంధనను పక్కన పెట్టి పెళ్లి చేయడంపై వస్తున్న విమర్శలపై కుమారస్వామి స్పందించారు. కుమారుడి పెళ్లిని సమర్థించుకున్నారు. పెళ్లికి ముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. నిఖిల్ పెళ్లి చేసి తప్పు చేయలేదన్నారు. పెళ్లిలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్నారు. తన తండ్రిని అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు అర్థరహితమైనవని కొట్టిపడేశారు. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితులు ముగిసిన తర్వాత మీతో కలిసి భోజనం చేస్తానంటూ కార్యకర్తలు, శ్రేయోభిలాషులను ఉద్దేశించి కుమారస్వామి ట్వీట్ చేశారు.