Kedarnath: తెరచుకోనున్న కేదార్, బదరీనాథ్ ఆలయాలు .. ప్రధాన అర్చకులను రప్పించే యత్నం!

Kedarnath and Badarinath temples going to open this month 29 and 30
  • ఈ నెల 29, 30 తేదీల్లో ఆలయాలు తెరిచేందుకు నిర్ణయం
  • ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న కేదార్ ప్రధాన అర్చకుడు
  • కేరళలో  బదరీ నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు 
చార్ థామ్ లలోని రెండు పుణ్యక్షేత్రాలు కేదార్ నాథ్, బదరీ నాథ్ ఆలయాలను ఈ నెలలో తెరవనున్నారు. ఈ నెల 29వ తేదీన కేదార్ నాథ్ ఆలయాన్ని, 30న బదరీనాథ్ ఆలయాన్ని తెరవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కేదార్ నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు మహారాష్ట్రలో, బదరీ నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు కేరళలో ఉన్నారు.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో  ఆయా ఆలయాల ప్రధాన అర్చకులను రప్పించే నిమిత్తం  ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఉత్పల్ కుమార్ సింగ్ చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు ఓ లేఖ రాశారు. ఆ అర్చకులను రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.
Kedarnath
Badarinath
Uttarakhand
Main priests
Lockdown

More Telugu News