Chandrababu: సీఎం జగన్ పై చంద్రబాబునాయుడు ఫైర్!
- ఏపీలోని ఎనభై శాతం జిల్లాలు రెడ్ జోన్లు
- రాజకీయాలపై కాదు ప్రజారోగ్యంపై జగన్ దృష్టి పెట్టాలి
- లేనిపక్షంలో మానవ నిర్మిత విపత్తుగా మారుతుంది
ఏపీలో ‘కరోనా’ మహమ్మారి విజృంభిస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని, ఇతర విషయాలపై దృష్టి పెడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ఏపీలోని ఎనభై శాతం జిల్లాలు రెడ్ జోన్లు అని, సంబంధిత శాఖ తెలియజేసిన వివరాలను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన జగన్ రాజకీయ అంశాలపై దృష్టి సారిస్తున్నారని దుయ్యబట్టారు. ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యలపై జగన్ దృష్టి పెట్టకపోతే కనుక మానవ నిర్మిత విపత్తుగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.