Mancherial District: తెలంగాణలో మరో జిల్లాకు విస్తరించిన కరోనా.. మంచిర్యాలలో తొలి కేసు నమోదు

First corona case in manchiryala district
  • ఈ నెల 14న హైదరాబాద్ లో చనిపోయిన జిల్లా మహిళ
  • ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ
  • ఆమె స్వగ్రామంలో హైఅలర్ట్‌ ప్రకటించిన జిల్లా అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్‌ విస్తరించింది. మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో జిల్లా అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఈ మహిళకు అనారోగ్యం చేయడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈనెల 14వ తేదీన ఆమె హైదరాబాద్‌లోనే చనిపోయింది. అప్పటికే పంపిన శాంపిల్స్‌లో ఆమెకు పాజిటివ్‌ అని తేలడంతో ముత్తరావుపల్లిలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు.  
Mancherial District
chennuru mandal
mutharaopalli
corona case

More Telugu News