అన్నయ్యా.. వదినకు కూడా ఛాన్స్ ఇస్తున్నావా?: కేటీఆర్ కు చెల్లి కవిత ప్రశ్న
- నా భార్య నాకు కటింగ్ చేయాలనుకుంటోందంటూ నెటిజన్ ట్వీట్
- కోహ్లీ అంతటోడే భార్యతో కటింగ్ చేయించుకున్నాడన్న కేటీఆర్
- కేటీఆర్ ట్వీట్ పై సరదాగా స్పందించిన కవిత
దీనికి కేటీఆర్ బదులిస్తూ "విరాట్ కోహ్లీ అంతటివాడే తన భార్యతో క్రాఫ్ చేయించుకుంటుంటే నువ్వెందుకు చేయించుకోవు?" అంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు. కేటీఆర్ ఇచ్చిన ఫన్నీ సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పలువురు దీనిపై సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ సోదరి, మాజీ ఎంపీ కవిత కూడా ఈ ట్వీట్ పై సరదా వ్యాఖ్యలు చేశారు. 'అన్నయ్యా... వదినకు కూడా ఛాన్స్ ఇస్తున్నావా?' అంటూ తమాషాగా ప్రశ్నించారు.మరి దీనికి అన్నయ్య ఏం సమాధానం ఇస్తారో చూడాలి!