Andhra Pradesh: పార్టీ రంగుల తొలగింపు కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురు!

  • పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు.. తొలగింపుల కేసు 
  • ఆ రంగులు తొలగింపుకు 3 నెలల గడువు కోరిన ప్రభుత్వం
  • కుదరదన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ సోమవారం నాడు
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో మారు షాక్ తగిలింది. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగులను తొలగించేందుకు మూడు నెలల సమయం కావాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో పంచాయతీ భవనాలకు కొత్త రంగులు వేసేందుకు ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని సోమవారం రోజున చెబుతామని న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Andhra Pradesh
Panchayatis
colors
case
AP High Court

More Telugu News