STPI: లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఎస్టీపీఐ భవనాల్లో అద్దెలు రద్దు చేసిన కేంద్రం

 From March to June no rental charges for STPI buildings
  • అంకుర, చిన్న, మధ్య తరహా సాఫ్ట్ వేర్ సంస్థలకు ఊరట
  • మార్చి - జూన్ వరకు నాలుగు నెలల పాటు అద్దెలు రద్దు
  • ఈ మేరకు  కేంద్ర సమాచార శాఖ ప్రకటన 

లాక్ డౌన్ నేపథ్యంలో అంకుర సంస్థలతో పాటు చిన్న, మధ్య తరహా సాఫ్ట్ వేర్ సంస్థలకు కేంద్రం ఊరట కల్పించింది. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ( ఎస్టీపీఐ) భవనాల్లో అద్దెలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలల పాటు అద్దెలు రద్దు చేస్తున్నట్టు కేంద్ర సమాచార శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఎస్టీపీఐకి దేశ వ్యాప్తంగా 60 ప్రాంతాల్లో భవనాలు ఉన్నాయి. అందులో 200 ఐటీ, ఐటీఈఎస్, ఎంఎస్ఎంఈ సంస్థలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News