Etela Rajender: తెలంగాణలో మొత్తం 700 పాజిటివ్ కేసులు: మంత్రి ఈటల

700 positive cases in Telangana state
  • తెలంగాణలో మరో 50  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
  • రాష్ట్రంలో ఇవాళ ‘కరోనా’ మరణం నమోదు కాలేదు
  • మొత్తం పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది మర్కజ్ కు వెళ్లొచ్చిన వారే 
తెలంగాణలో మరో 50 ‘కరోనా’ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఈ కేసులతో సహా ఇప్పటి వరకు మొత్తం 700 కేసులు నమోదైనట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో ఇవాళ ‘కరోనా’ మరణం నమోదు కాలేదని, ఈ వైరస్ బారి నుంచి కోలుకున్న 68 మందిని డిశ్చార్జి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు పది వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, హైదరాబాద్ లో ఈరోజు 800 నమూనాలు పరీక్షించినట్టు చెప్పారు. నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లొచ్చిన వారేనని చెప్పారు.
Etela Rajender
TRS
Telangana
COVID-19

More Telugu News