China: చైనా ఎగుమతి చేసిన కిట్లలో 30 శాతం నాసిరకమే!

China exporting low quality PPE kits
  • ప్రపంచ వ్యాప్తంగా పీపీఈ కిట్లకు డిమాండ్
  • ఎగుమతుల్లో తొలి స్థానంలో ఉన్న చైనా
  • నాణ్యతపై ఫిర్యాదు చేస్తున్న పలు దేశాలు

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత సంరక్షణ పరికరాలకు (పీపీఈ) ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పలు దేశాలు విదేశాల నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నాయి. వీటిని తయారు చేసి, ఎగుమతి చేస్తున్న దేశాలలో చైనానే ముందుంది.

 అయితే చైనా పంపుతున్న పీపీఈ కిట్ల నాణ్యతపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా కిట్లు, మాస్కులపై ఇప్పటికే ఇటలీ, అమెరికా, స్పెయిన్ దేశాలు ఫిర్యాదు చేశాయి. మరోవైపు భారత్ కు చైనా పంపిన సామగ్రిలో కూడా డొల్లతనం బయటపడింది. ఇండియాకు పంపిన కిట్లలో దాదాపు 30 శాతం కిట్లలో నాణ్యత లేదని తేలింది. మరోవైపు ఈ ఆరోపణలపై చైనా స్పందిస్తూ, ప్రఖ్యాతిగాంచిన కంపెనీల నుంచే వీటిని ఆర్డర్ చేయాలని సూచించింది.

  • Loading...

More Telugu News