Ramcharan: గరిట తిప్పిన చెర్రీ... వీడియో పోస్ట్ చేసిన భార్య!

Ramcharan in Kitchen Video goes Viral
  • భార్య కోసం డిన్నర్ తయారు చేసిన రామ్ చరణ్
  • ఆ తరువాత అంట్లు కూడా తోమారన్న ఉపాసన
  • అందుకే తన దృష్టిలో హీరో అంటూ ట్వీట్
లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రామ్ చరణ్, తన భార్య ఉపాసనకు స్వయంగా వండి వడ్డించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన ఉపాసన, అందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.

"తన భార్య కోసం రామ్ చరణ్ డిన్నర్ తయారు చేసిన వేళ... (కొన్ని లవ్ సింబల్స్) అందరు భర్తలూ దీన్ని గమనించాలి. వంట వండటమే కాదు. వండిన తరవాత అంట్లు కూడా తోమాడు. అందుకే అతను నా దృష్టిలో హీరో అయ్యారు" అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో గరిట పట్టి, కిచెన్ లో వండుతున్న చెర్రీ కనిపిస్తుండగా, ఈ వీడియో వైరల్ అయింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి, తన ఇంటి ముందు శ్రమదానం చేస్తూ, తోటలోని చెట్లకు నీరు పట్టి, ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేశారు. నడిచే దారులు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ, అందుకు సంబంధించిన దృశ్యాలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Ramcharan
Upasana
Twitter

More Telugu News