Varla Ramaiah: ఎస్‌ఈసీగా పనిచేసిన ఓ సీనియర్ అధికారిని అన్ని మాటలు అంటుంటే నోరు తెరువని ఐఏఎస్‌ల సంఘం ఉన్నట్లా, లేనట్లా?: వర్ల రామయ్య

Is there an association of IASs that doesnt open the mouth of the Election Commissioner at all says Varla Ramaiah
  • ఏపీ ఐఏఎస్‌ల సంఘం నిర్వీర్యమైనట్టుంది
  • ఎస్‌ఈసీని బొచ్చు పీకుతాడా అని రాజకీయ నాయకుడు అంటే స్పందించదా?
  • ఐఏఎస్‌ల సంఘాన్ని ప్రశ్నించిన వర్ల
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై  ఆధికార వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ ఐఏఎస్ అధికారుల సంఘం ఎందుకు స్పందించడం లేదని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.  ఏపీ మంత్రి కొడాలి నాని ఇటీవల రమేశ్ కుమార్ పై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రమేశ్ పై  మంత్రి వాడిన పదజాలాన్ని ఉటంకిస్తూ ట్వీట్ చేసిన రామయ్య.. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల సంఘం నిర్వీర్యమైందని ఎద్దేవా చేశారు.

‘భారత దేశంలో అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగం ఐఏఎస్. తమ కష్ట నష్టాలు మాట్లాడుకోవటానికి వారికీ ఓ సంఘం ఉంది. కానీ, ఇటీవల ఆ సంఘం నిర్వీర్యమైంది. లేకపోతే రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ఓ సీనియర్ అధికారిని (ఎస్ఈసీ) ఒక రాజకీయ నాయకుడు.. ఏం చేస్తాడు బొచ్చు పీకుతాడా? అంటే నోరు తెరువని సంఘం ఉన్నట్లా, లేనట్లా?’ అని  ట్వీట్ చేశారు.
Varla Ramaiah
IAS
Association
State Election Commission
YSRCP

More Telugu News