Bollywood: హిల్‌స్టేషన్ లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్

Aamir Khans Son Junaid Stuck at Their Panchgani Bungalow During Lockdown
  • లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో పాంచ్‌గానీలో జునైద్
  • 14కు ముంబై రావాలనుకున్న సమయంలో లాక్‌డౌన్ పొడిగింపు
  • ఆందోళనలో ఆమిర్ కుటుంబం
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ఖాన్ తనయుడు జునైద్ మహారాష్ట్రలోని పాంచ్‌గానీ హిల్‌స్టేషన్‌లో ఉన్న బంగ్లాలో చిక్కుకుపోయాడు. ఆమిర్‌ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలోని పాలీహిల్‌లో నివసిస్తుండగా, కుమారుడు జునైద్ మాత్రం పాంచ్‌గానీ బంగ్లాలో చిక్కుకుపోవడంతో అతడి కుటుంబం ఆందోళన చెందుతోంది. తామంతా ఒకచోట ఉంటే జునైద్ మాత్రం మరోచోట ఉండిపోయాడని ఆమిర్ ఆవేదన చెందుతున్నాడు. గత నెలలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు జునైద్ అక్కడే ఉన్నాడు. దీంతో గడువు ముగిశాక ముంబై వస్తాడని భావించారు. అయితే, లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగించడంతో జునైద్ అప్పటి వరకు అక్కడ ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.
Bollywood
Aamir Khan
Junaid
Panchgani
Lockdown

More Telugu News