Uttam Kumar Reddy: ఆ రూ.1500 కోట్లు ఏమయ్యాయి.. వారం రోజులకే జీతాలు ఇచ్చుకోలేని దుస్థితా?: మండిపడిన ఉత్తమ్

TPCC Chief Uttam Kumar Reddy fires on KCR Govt
  • నిన్న ప్రతిపక్ష నేతల సమావేశం
  • వలస కూలీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందన్న ఉత్తమ్
  • కేసీఆర్ తీరుతో ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు
బాండ్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సేకరించిన ఆ రూ.1500 కోట్లు ఏమయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. నిన్న వివిధ ప్రతిపక్షాల నేతలతో నిర్వహించిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కేసీఆర్ వ్యవహార శైలి వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందన్నారు.

వారం రోజుల లాక్‌డౌన్‌కే జీతాలు ఇచ్చుకోలేని స్థితికి ప్రభుత్వం చేరుకుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, నగదు సాయం ఇప్పటికీ అందలేదని, వలస కూలీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఉత్తమ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సాయం కింద అందిస్తున్న బియ్యం ఏమయ్యాయని నిలదీశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రతిపాదించిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
Uttam Kumar Reddy
Congress
Telangana
KCR

More Telugu News