TTD: ఏపీలో పేదల ఆకలి తీర్చేందుకు టీటీడీ భారీ విరాళం

Tirumala Tirupathi Devastnam releases donation fund
  • లాక్ డౌన్ కారణంగా పేదలు, వలస కూలీలు ఆకలి బాధ పడకూడదు
  • టీటీడీ అన్నదానం ట్రస్టు నుంచి జిల్లాకు రూ.కోటి చొప్పున విరాళం
  • పేదలకు అన్నదానం నిమిత్తం ఈ నిధులను వినియోగించాలి: టీటీడీ 
లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ విరాళం ప్రకటించింది. టీటీడీ అన్నదానం ట్రస్టు నుంచి జిల్లాకు కోటి రూపాయల చొప్పున విరాళంగా అందించింది. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కార్మికులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని, వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతోనే విరాళం అందజేశామని టీటీడీ తెలిపింది. పేదలకు అన్నదానం నిమిత్తం ఈ నిధులను వినియోగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
TTD
Andhra Pradesh
Lockdown
Donation

More Telugu News