Etela Rajender: తెలంగాణలో ఏ జిల్లాలో ఎంతమందికి కరోనా..? మ్యాప్‌ పోస్ట్ చేసిన మంత్రి ఈటల

District wise break up on status of positive cases of COVID19 in Telangana
  • హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్న 249 మంది
  • కోలుకున్న వారి సంఖ్య 58
  • నిజామాబాద్‌లో 36 మంది బాధితులు
  • వికారాబాద్‌లో 29 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులపై మంత్రి ఈటల రాజేందర్‌ ఓ మ్యాప్‌ పోస్ట్ చేశారు. ఏయే జిల్లాల్లో ఎన్నెన్ని కేసులు నమోదయ్యాయన్న విషయాన్ని అందులో తెలిపారు. ఆదిలాబాద్‌లో 11, అసిఫాబాద్‌లో 3, నిర్మల్‌లో 17, జగిత్యాలలో 2, పెద్దపల్లిలో 2, భూపాలపల్లిలో 3, నిజామాబాద్‌లో 36, కోలుకున్న వారు 15, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1, కామారెడ్డిలో 8, కరీంనగర్‌లో 4, కోలుకున్నవారు 14 మంది ఉన్నారు.
                                                                                                 
కామారెడ్డిలో 8, కోలుకున్న వారి సంఖ్య 3, ములుగులో 2, సిద్ధపేటలో 1, మెదక్‌లో 3, కోలుకున్న వారు 3, జనగాంలో కోలుకున్న వారు 2, మహబూబాబాద్‌లో 1, భద్రాద్రిలో 2, కోలుకున్న వారి సఖ్య 2, హైదరాబాద్‌లో 249 మంది, కోలుకున్న వారి సంఖ్య 58, వికారాబాద్‌లో 29, ఖమ్మంలో 7, నల్లగొండలో 12, సూర్యాపేటలో 23, నాగర్‌కర్నూల్‌లో 2, జోగులాంబలో 18, కోలుకున్న వారు ఒక్కరు ఉన్నారు.

కాగా, నిన్న  రాష్ట్రంలో కొత్తగా 52 కేసులు నమోదయిన విషయం తెలిసిందే. ఈ కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం 644 మంది బాధితులున్నారు. కరోనాను అరికట్టడానికి ఇప్పటికే హాట్‌స్పాట్‌ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ అక్కడి ప్రజలను బయటకు రాకుండా ప్రభుత్వం కట్టడి చేస్తోంది.
Etela Rajender
Telangana
Corona Virus

More Telugu News