Ravi Rana: లాక్ డౌన్ ను ఉల్లంఘించిన మహారాష్ట్ర ఎమ్మెల్యేపై కేసు!

Case on MLA for Violating Norms
  • అంబేద్కర్ జయంతిని నిర్వహించిన ఎమ్మెల్యే
  • అనుచరులతో కలిసి బారికేడ్ల తొలగింపు
  • ఐపీసీ 188 కింద కేసు పెట్టిన పోలీసులు
మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవీ రాణాపై లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న కేసు నమోదైంది. మంగళవారం నాడు బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రవీ రాణా, ఆయన అనుచరులు తొలగించారని, ఆంక్షలు అమలులో ఉన్న ఇర్విన్ స్క్వేర్ వద్దకు వెళ్లి, అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారని ఓ అధికారి తెలిపారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ, ఈ తరహా చర్యలు ప్రమాదాన్ని మరింతగా పెంచుతాయని, దీంతోనే ఆయనపై కేసు నమోదు చేశామని గడేనగర్ పోలీసు ఇనస్పెక్టర్ మనీశ్ థాకరే వెల్లడించారు. ఆయనతో పాటు మరో ఐదుగురిపైనా ఐపీసీలోని సెక్షన్ 188, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు.

ఇదిలావుంచితే, గతంలో పలు తెలుగు సినిమాలలో నటించిన కథానాయిక నవనీత్ కౌర్ భర్తే రవీ రాణా. నవనీత్ ఇప్పుడు మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలిగా వున్నారు.
Ravi Rana
Maharashtra
MLA
Lockdown
Police

More Telugu News