Hyderabad: గొడవలతో మనస్తాపం.. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దంపతులు

Couple Hanged self in Hyderabad
  • హైదరాబాద్ శివారు నిజాంపేటలో ఘటన
  • అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
  • గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు

కుటుంబంలో చెలరేగిన కలహాలు దంపతుల ఉసురు తీశాయి. తరచూ గొడవలు జరుగుతుండడంతో మనస్తాపం చెందిన దంపతులు ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శివారులోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట శ్రీనివాసకాలనీకి చెందిన పి.సురేందర్ (42), బిందు (36) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తల మధ్య గత కొన్ని రోజులుగా తరచూ గొడలు జరుగుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఇంట్లో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారుంటున్న ఇంటిపైనే భర్త సోదరుడు ఉంటున్నాడు. ఇంట్లో నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడంతో అనుమానించిన ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో ఆత్మహత్య విషయం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతితో చిన్నారులైన వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

  • Loading...

More Telugu News