గుంటూరును భయపెడుతున్న కరోనా.. రాష్ట్రంలో అత్యధిక కేసులు అక్కడే!
- జిల్లాలో ఇప్పటి వరకు 114 కేసుల నమోదు
- రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది మృతి
- 91 కేసులతో రెండో స్థానంలో కర్నూలు
కరోనా మహమ్మారితో రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 16 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 458 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గుంటూరు తర్వాత 91 కేసులతో కర్నూలు రెండో స్థానంలో ఉండగా, నెల్లూరు (56), కృష్ణా (44), ప్రకాశం (42) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తూర్పుగోదావరిలో అత్యల్పంగా 17 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
.