Kanna Lakshminarayana: రైతుల ఖాతాలో కేంద్రం రూ.2000 చొప్పున జమ చేసింది: కన్నా

Kanna Lakshminarayana tells Centre deposits two thousand rupees into farmers accounts
  • రైతులకు పీఎం కిసాన్ యోజన వర్తింపు
  • ఆపన్నహస్తం అందించారన్న కన్నా
  • రైతాంగం తరఫున మోదీ, నిర్మలా సీతారామన్ లకు ధన్యవాదాలు
కరోనా లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో ఏపీ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం నగదు బదిలీ చేసిందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ.2000 చొప్పున జమ చేశారని తెలిపారు. కష్టకాలంలో ఆపన్నహస్తం అందించిన ప్రధాని మోదీకి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర రైతుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ట్వీట్ చేశారు.
Kanna Lakshminarayana

More Telugu News