24 గంటల్లో 1,463 కేసులు, 29 మరణాలు... భారత్ లో కరోనా తీవ్రం

  • దేశంలో 10 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య
  • ఇప్పటివరకు 353 మంది మరణం
  • 1,189 మంది కోలుకున్నట్టు వెల్లడించిన కేంద్రం
భారత్ లో కరోనా వైరస్ తీవ్రత మరింత పెరిగింది. కేసుల పెరుగుదల ఎన్నడూ లేనంతగా 24 గంటల్లో 1,463 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 29 మంది మరణించారు. కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. ఈ సాయంత్రం 5 గంటల సమయానికి భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 10,815గా నమోదైంది. క్రియాశీలకంగా ఉన్న కేసుల సంఖ్య 9,272 కాగా, 1,189 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 353 మంది మరణించారు. ఈ మేరకు కేంద్రం ట్విట్టర్ లో వెల్లడించింది.

Corona Virus
India
Positive Cases
Deaths

More Telugu News