Rahul Gandhi: సకాలంలో టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi slams Centre there is no sufficient corona tests
  • జనాభాకు తగిన రీతిలో టెస్టులు నిర్వహించడంలేదన్న రాహుల్
  • 10 లక్షల మందికి సగటున 149 టెస్టులేనంటూ విమర్శలు
  • కరోనాపై పోరులో మనం ఎక్కడున్నాం అంటూ ట్వీట్
భారత్ లో జనాభా సంఖ్యకు తగిన విధంగా కరోనా టెస్టులు నిర్వహించడంలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కరోనా టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేయడంలో జాప్యం చేశారని, ఇప్పుడా టెస్టింగ్ కిట్లకు విపరీతమైన కొరత ఏర్పడిందని కేంద్రంపై విమర్శలు చేశారు.

సగటున 10 లక్షల మందికి నిర్వహిస్తున్న టెస్టుల సంఖ్య 149 మాత్రమేనని, ఈ విషయంలో మనం లావోస్ (157), నైజర్ (182), హోండురాస్ (162) దేశాల సరసన చేరామని ఎద్దేవా చేశారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో సామూహిక నిర్ధారణ పరీక్షలు కీలకమని భావిస్తున్న తరుణంలో మనం ఎక్కడున్నామో ఓసారి పరిశీలించుకోవాలని కేంద్రానికి హితవు పలికారు.
Rahul Gandhi
Corona Virus
Tests
Kits
India

More Telugu News