Amit Shah: కేంద్ర హోం మంత్రిగా చెబుతున్నా.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: అమిత్ షా

No need to fear about lockdown says Amit Shah
  • లాక్ డౌన్ పట్ల ఎవరూ ఆందోళన చెందొద్దు
  • సరిపడా ఆహార నిల్వలు, ఔషధాలు ఉన్నాయి
  • పేదలకు సంపన్నులు సాయం చేయాలి
లాక్ డౌన్ నేపథ్యంలో దేశ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో అందరికీ సరిపడా ఆహార నిల్వలు, ఔషధాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో హోంమంత్రిగా తాను భరోసా ఇస్తున్నానని చెప్పారు.

ఇదే సందర్భంగా దేశంలోని సంపన్నులకు అమిత్ షా ఓ విన్నపం చేశారు. దేశంలోని పేదలకు సంపన్నులు సాయం చేయాల్సిన అవసరం వచ్చిందని... అందరూ ముందుకు వచ్చి సేవ చేయాలని కోరారు. లాక్ డౌన్ పొడిగింపుతో భయపడాల్సిన అవసరం లేదని... విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు విధులను నిర్వహిస్తున్నారని... వారి నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతున్నారని కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Amit Shah
BJP
Lockdown

More Telugu News