Varla Ramaiah: పరిమళ్ నత్వానీ గారు ఎక్కడ సార్?... కనబడడం లేదు: వర్ల రామయ్య

Varla Ramaiah questions AP government where is Parimal Nathwani in this crisis time
  • ఏపీ నుంచి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం 
  • రాష్ట్రంలో కరోనా కల్లోలం
  • నత్వానీ ఏపీకి ఉపయోగపడడా? అంటూ వర్ల ప్రశ్నాస్త్రం
రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న తరుణంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య స్పందించారు. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యత్వానికి అవకాశం అందుకున్న పరిమళ్ నత్వానీ కనబడడం లేదంటూ విమర్శనాస్త్రం సంధించారు.

"సీఎం గారూ, ఎక్కడో పుట్టి, ఎక్కడో ఉంటూ మన రాష్ట్రానికి సంబంధంలేని పరిమళ్ నత్వానీ గారికి రాజ్యసభ చాన్స్ ఇచ్చారు. మరి మన రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే ఆయన కనబడడు, వినబడడు. ఆయన సంపద వ్యక్తులకు మాత్రమేనా..? మన రాష్ట్రానికి ఉపయోగపడడా..? ఇదేంటి సార్, మన ఖర్మ కాకపోతే!" అంటూ ట్వీట్ చేశారు.

రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంతో సంబంధాలున్న పరిమళ్ నత్వానీకి వైసీపీ ఏపీ నుంచి రాజ్యసభ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సంప్రదింపుల అనంతరం వైసీపీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Varla Ramaiah
Parimal Nathwani
Andhra Pradesh
Rajya Sabha
Corona Virus
Lockdown

More Telugu News