Junior NTR: ఎన్టీఆర్ మూవీలో రాజకీయ నాయకుడిగా సంజయ్ దత్?

Ayinanu Poyiravale Hasthinaku Movie
  • త్రివిక్రమ్ నుంచి 'అయినను  పోయిరావలె హస్తినకు'
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథాకథనాలు
  • అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్
త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నాడు. దీనికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. ఈ కథ రాజకీయాల నేపథ్యంలో కొనసాగుతుందట. ఒక బలమైన రాజకీయనాయకుడి పాత్రతో ఎన్టీఆర్ పాత్ర తలపడనున్నట్టు తెలుస్తోంది.

ఆ పాత్రకి సంజయ్ దత్ అయితే కరెక్టుగా సెట్ అవుతాడనే ఉద్దేశంతో, ఆయనను దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ ఆ పాత్రను డిజైన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ పాత్ర గురించి సంజయ్ దత్ కి చెప్పి ఆయనను ఒప్పించగలననే నమ్మకంతోనే త్రివిక్రమ్ వున్నాడని చెబుతున్నారు. సంజయ్ దత్ కారణంగా సినిమాకి మరింత భారీతనం వస్తుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన నాయికలుగా జాన్వీ కపూర్ .. పూజ హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. అక్టోబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Junior NTR
Pooja Hegde
sanjay Dutt

More Telugu News