Mekathoti Sucharitha: వయసు పెరిగితే సరిపోదు.. మీ బుద్ధి కూడా పెరగాలి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు: హోంమంత్రి సుచరిత

sucharita fires on gorantla
  • జగన్‌ చేసిన వ్యాఖ్యలపై వీడియో పోస్ట్ చేసిన గోరంట్ల 
  • వీడియోను కట్‌ చేసి పోస్ట్ చేశారన్న సుచరిత
  • జగన్ మాటలను వక్రీకరించేలా వీడియో పోస్ట్ చేశారన్న సుచరిత
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. బుచ్చయ్య చౌదరి నకిలీ వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏది నకిలీ వీడియోనో, ఏది అసలు వీడియోనో తెలుపుతూ ఆమె రెండు వీడియోలు పోస్ట్ చేశారు.

మొదటి వీడియోకి దొంగల పార్టీ ప్రచారం వీడియో అని, రెండో దానికి అసలు వాస్తవ వీడియో అని ఆమె పేర్లు పెట్టి తన ట్విట్టర్‌ ఖాతాలో పలు వ్యాఖ్యలు చేశారు. వక్రీకరిస్తూ తప్పుడు సమాచారం ఇస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ రాష్ట్ర యువతకు టీడీపీ నేత ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.  

'వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి కూడా పెరగాలి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారూ. వీలైనంత వరకు కాంట్రాక్టు ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి లాగేద్దాం అన్న జగన్ గారి మాటలను ఇలా మూడు సెకన్ల వీడియోతో దిక్కుమాలిన ట్వీట్లు చేస్తూ యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? హుందాగా ప్రవర్తించండి, ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు' అని సుచరిత విమర్శలు గుప్పించారు.

'ప్రభుత్వంలోకి లాగేద్దాం' అని జగన్‌ అన్నారంటూ బుచ్చయ్య చౌదరి ఇటీవల వీడియో పోస్ట్ చేశారు. 'ఏమి లాగేస్తారో కొంచం వివరిస్తారా...? అని ప్రశ్నించారు. వీలైనంత వరకు కాంట్రాక్టు ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి లాగేద్దామంటూ జగన్‌ పలు మంచి విషయాలు చెప్పారని సుచరిత వివరించారు. అలా ఆయన మాట్లాడిన వీడియోను మూడు సెక్షన్లే చూపిస్తూ తప్పుడు అర్థం వచ్చేలా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

Mekathoti Sucharitha
YSRCP
Andhra Pradesh

More Telugu News