Pakistan: పాకిస్థాన్‌లో కుప్పకూలిన సైనిక విమానం...ఇద్దరు పైలట్ల దుర్మరణం

  • రిహార్సల్స్‌కు బయలు దేరిన విమానం
  • పాకిస్థాన్‌ డే పరేడ్‌లో దుర్ఘటన
  • ముస్తాక్‌ శిక్షణ విమానం
పాకిస్థాన్‌లో ఓ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. పాకిస్థాన్‌ డే పరేడ్‌ రిహార్సల్స్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రిహార్సల్స్‌లో భాగంగా ముస్టాక్‌ విమానం షాకర్‌ పరియాన్‌లో బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. దీంతో అందులో ప్రయాణించిన పైలట్లు మేజర్‌ ఉమెర్‌, లెఫ్టినెంట్‌ ఫైజాన్‌లు చనిపోయినట్టు గుర్తించారు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని అక్కడి మీడియా పేర్కొంది.
Pakistan
army trained jet
crashed
two died

More Telugu News