Hyderabad: యువతుల ఆత్మహత్య కేసులో కీలక విషయాలను సేకరించిన పోలీసులు!

Police collects key information in Medchal women suicide case
  • మృతులు సుమతి, రేవతి, అనూషలుగా గుర్తింపు
  • రెండు రోజుల క్రితం హైదరాబాదుకు వచ్చిన వైనం
  • జవహర్ నగర్ ప్రాంతంలో ఓ పాస్టర్ వద్ద ఆశ్రయం
హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ ప్రాంతంలో మూడు మృత దేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉన్న డెంటల్ కాలేజీ డంపింగ్ యార్డు వద్ద మర్రిచెట్టుకు వేలాడుతూ ఇద్దరు యువతుల మృతదేహాలు కనిపించాయి. ఆ పక్కన ఓ చిన్నారి డెడ్ బాడీ కనిపించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు. మృతులను సుమతి, రేవతి, అనూషలుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో హార్పిక్ తో పాటు రెండు స్మార్ట్ ఫోన్లు కనిపించాయని కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ తెలిపారు.

ఏసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం... మృతులు ముగ్గురూ కరీంనగర్ జిల్లాకు చెందినవారు. రెండు రోజుల క్రితం వీరు హైదరాబాదుకు వచ్చారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతంతో ఓ పాస్టర్ దగ్గర ఉంటున్నారు. నిన్న రాత్రి 11.30 గంటలకు ముగ్గురూ బయటకు వచ్చారు. డంపింగ్ యార్డ్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిన్నారికి కూల్ డ్రింక్ లో హార్పిక్ కలిపి ఇచ్చారు. పాప చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత యువతులిద్దరూ చెట్టుకు ఉరి వేసుకున్నారు. కుటుంబ కలహాల వల్లే వీరు బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
Hyderabad
Medchal
Women Suicide

More Telugu News