Corona Virus: తెలంగాణలో 531కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య... మరో ఇద్దరి మృతి

Telangana corona toll raises to five hundred and thirty one
  • రాష్ట్రంలో కొత్తగా 28 కేసులు
  • 16కి పెరిగిన మృతుల సంఖ్య
  • ఇవాళ ఏడుగురు డిశ్చార్జి
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 28 కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 531కి చేరింది. తాజాగా మరో రెండు మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 16కి పెరిగింది. ఇవాళ తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న ఏడుగురిని డిశ్చార్జి చేశారు. కాగా, రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రాన్ని కోరడం తెలిసిందే. తొలి దశ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా, ఏప్రిల్ 30 వరకు అమలు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
Corona Virus
Telangana
Deaths
Positive
COVID-19

More Telugu News