Arvind Kejriwal: లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ప్రధాని సరైన నిర్ణయం తీసుకున్నారు: సీఎం కేజ్రీవాల్

Kejriwal says PM has taken correct decision to extend lockdown
  • సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • కరోనా పరిస్థితులపై చర్చ
  • లాక్ డౌన్ ను పొడిగించారని కేజ్రీవాల్ వెల్లడి
దేశంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ లో స్పందించారు. లాక్ డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని సరైన నిర్ణయం తీసుకున్నారని కేజ్రీవాల్ వెల్లడించారు. లాక్ డౌన్ ను చాలా ముందుగానే ప్రకటించడం వల్ల మిగతా దేశాల కంటే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తేశామంటే, ఇప్పటివరకు పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని అభిప్రాయపడ్డారు. మన కష్టం మరింతగా ప్రతిఫలించాలంటే లాక్ డౌన్ ను పొడిగించడం అత్యావశ్యకం అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Arvind Kejriwal
Narendra Modi
Lockdown
Corona Virus
Video Conference

More Telugu News