Jayaprakash Narayan: ఒక పద్ధతి ప్రకారం లాక్ డౌన్ ను ఎత్తివేయాలి: జయప్రకాశ్ నారాయణ

Jayaprakash Narayan suggests to lift lockdown gradually
  • కోట్లాది మంది ఉపాధిని కోల్పోతున్నారు
  • పెద్ద ఎత్తున కరోనా టెస్టింగ్ జరపాలి
  • పెద్ద వాళ్లను ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలి
లాక్ డౌన్ కారణంగా దేశంలో కోట్లాది మంది ఉపాధిని కోల్పోతున్నారని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ నేపథ్యంలో ఒక పద్ధతి ప్రకారం లాక్ డౌన్ ను క్రమంగా సడలించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా టెస్టింగ్ జరపాలని సూచించారు.

మన దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా కరోనా టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. 60 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని అన్నారు. పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడకుండా చూడాలని చెప్పారు. 130 కోట్ల జనాభాలో 200 మంది మరణించడం పెద్ద సంఖ్య కాదని అన్నారు.
Jayaprakash Narayan
Loksatta
Corona Virus

More Telugu News